
ఓవైపు మ్యూజిక్ డైరెక్టర్గా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా నటుడిగానూ ప్రూవ్ చేసుకుంటున్నాడు జీవీ ప్రకాష్ కుమార్. ఆయన లీడ్ రోల్లో, సీనియర్ డైరెక్టర్ భారతీరాజా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న సినిమా ‘చోరుడు’. పీవీ శంకర్ దర్శకత్వంలో జి ఢిల్లీ బాబు నిర్మిస్తున్నారు. శుక్రవారం టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు మోషన్ పోస్టర్ను విడుదల చేశారు.
వీడియోని బట్టి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. బ్యాగ్రౌండ్లో ఏనుగు అరుస్తున్న శబ్ధం వినిపిస్తోంది. ఏనుగు పాదాలపై జీవీ ప్రకాష్, భారతీరాజా నిలబడి చూస్తున్న పోస్టర్ సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. జీవీ ప్రకాష్ నటిస్తూనే.. సంగీతం కూడా అందిస్తున్నాడు.