నేనున్నా మీకు పదండ్రా...

నేనున్నా మీకు పదండ్రా...

మామూలుగా ఒక గొర్రె ఏం చేస్తే మిగతా గొర్రెలు కూడా అదే చేస్తాయి అని ఒక నానుడి ఉంది. కానీ.. ఇక్కడ కుక్కలు కూడా అదే పని చేస్తున్నాయి. ఒక పెద్ద ఇనుప బోనులో చాలా కుక్కలున్నాయి. అయితే అవి కడుపు నిండా తినేసి, అటు ఇటు తిరుగుతున్నాయి. కానీ.. ఎప్పుడూ వాటికి ఆ బోను నుంచి బయటికి రావాలని అనిపించలేదు. ఈసారి మాత్రం ఒక చిన్న కుక్కపిల్ల బోను నుంచి బయటికి రావాలని, పైకి ఎక్కడం మొదలుపెట్టింది. దాన్ని చూసి, మిగతా కుక్కలు కూడా ఇన్​స్పైర్​ అయినట్టున్నాయి. వెంటనే ఒక కుక్క ఒక్క ఉదుటున పైకి ఎగిరి, కుక్క పిల్ల కంటే ముందే బోన్​ పైకి ఎక్కేసి, బయటికి దూకింది. ఇదంతా చూస్తున్న మిగతా కుక్కలు ఊరుకుంటాయా? అవి కూడా బోన్​ ఎక్కేందుకు ఎగబడ్డాయి. ఈ వీడియోకి ‘తిరుగుబాటు ఈరోజు నుంచే మొదలైంది’ అంటూ ట్యాగ్​ పెట్టారు. దీనికి ‘ఒక్కరి కష్టం వందమందికి ఆదర్శం’ అని రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.