మరో 15 మందికి గాయాలు
బెంగళూరు: కర్నాటకలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లాలోని కలంబెల్లా సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న క్రూయిజర్ జీపును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. 15 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. గాయపడినవారిని ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారని.. కూలీ పనుల కోసం బెంగళూరుకు బయలుదేరారని వివరించారు. మృతుల్లో కొందరు ఒకే కుటుంబానికి చెందిన వారున్నారని వెల్లడించారు.ప్రమాదం జరిగిన టైమ్లో జీపులో 24 మంది ఉన్నట్లు చెప్పారు. లారీని జీపు ఓవర్‌టేక్ చేసే క్రమంలో.. జీపును లారీ వెనక నుంచి ఢీకొట్టిందని వివరించారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోవడంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.

