గుర్ గ్రామ్లో లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వరుణ్ నాథ్

గుర్ గ్రామ్లో లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వరుణ్ నాథ్

హర్యానాలోని గుర్ గ్రామ్ లో వరుణ్ నాథ్ అనే వ్యక్తి లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డ్ వరుణ్ ని కాపాడి.. బయటకు వచ్చేలా చేశాడు. అయితే ప్రమాదం నుంచి బయటపడిన వరుణ్.. వెంటనే సెక్యూరిటీ గార్డును చెంపదెబ్బలు కొట్టాడు. తర్వాత ఆ లిఫ్ట్ ఆపరేటర్ ని కూడా కొట్టారు. ఈ విజువల్స్ అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో  అపార్ట్ మెంట్  గార్డులు వరుణ్ నాథ్  డౌన్  డౌన్  అంటూ నినాదాలు చేశారు. వరుణ్ నాథ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా..పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.