తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన మెడికవర్ డాక్టర్లు

తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన మెడికవర్ డాక్టర్లు

మాదాపూర్, వెలుగు: బ్రెస్ట్ క్యానర్స్ మూడో స్టేజ్​లో ఉన్న సోమాలియా దేశానికి చెందిన గర్భిణికి మాదాపూర్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లు విజయవంతంగా ట్రీట్ మెంట్ అందించారు. మంగళవారం హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంకాలజిస్ట్​ డాక్టర్​ సాద్విక్ రఘురాం వివరాలు వెల్లడించారు. సోమాలియాకు చెందిన ఫదుమో మహ్మద్ ఒమర్​(33) మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకు బ్రెస్ట్ క్యానర్ మూడో స్టేజ్​లో ఉన్నట్లు తెలిసింది.

మాదాపూర్​లోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్​లో ఆమె అడ్మిట్ కాగా.. అంకాలజిస్ట్ డాక్టర్ సాద్విక్  పరీక్షించి​ ట్రీట్​మెంట్ మొదలుపెట్టారు. మహిళతో పాటు  ఆమెకు పుట్టబోయే బిడ్డను కాపాడేందుకు కీమోథెరపీ అందజేశారు. ట్రీట్​మెంట్ టైమ్​లో ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించారు. కీమో కోర్సు విజయవంతంగా పూర్తి కావడంతో ఇటీవల ఆ  మహిళ బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సమావేశంలో స్టాఫ్ పాల్గొన్నారు.