
యూత్ అంతా దాదాపు ఫిట్ నెస్.. ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. దీని కోసం యోగా సెంటర్లు.. జిమ్ సెంటర్లు సిటీలో ప్రతి గల్లీలోనూ వెలుస్తున్నాయి. అంతేకాదండోయ్....ఫీజు విషయంలో బంపరాఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. అయితే ఓ యోగా సెంటర్ మే 20న ఓటు వేసిన వారికి ఆఫర్ప్రకటించింది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. . .
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి స్థానిక పరిపాలనతో పాటు అనేక రెస్టారెంట్లు, యోగా సెంటర్లు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మే 20, సోమవారం నాడు పోలింగ్ జరగనున్న ముంబైలో కూడా ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచడం కోసం ప్రోత్సహకరంగా ...ఒక యోగా స్టూడియో ఓటు వేసిన తర్వాత సిరా వేసిన వేలితో సెల్ఫీని క్లిక్ చేసి, స్టూడియోను ట్యాగ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే వారికి ఉచిత పాఠాలను అందించనున్నట్లు ప్రకటించింది.
అలాగే హోటల్స్, కేఫ్‌లు పోలింగ్ జరిగే రోజుల్లో భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు వంటి ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తున్నాయి. పోలింగ్ రోజు ముంబైలో మెట్రో లైన్లు 2A, 7లోని ప్రయాణికులకు ప్రత్యేకంగా 10 శాతం తగ్గింపును అందిస్తున్నారు. కార్డ్, పేపర్ క్యూఆర్, పేపర్ టిక్కెట్‌లను ఉపయోగించి పోలింగ్ స్టేషన్‌లకు ప్రయాణించి, ఓటు వేసిన తర్వాత ఇంటికి తిరిగి రావడానికి, బేస్ చార్జీపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు పొందవచ్చు. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ముంబై అంతటా ఫుడ్‌పై 20 శాతం తగ్గింపును అందిస్తోంది.