అపార్ట్‌మెంట్‌ వాచ్‌‌మెన్‌ని చెప్పుతో కొట్టిన మ‌హిళ‌

అపార్ట్‌మెంట్‌ వాచ్‌‌మెన్‌ని చెప్పుతో కొట్టిన మ‌హిళ‌

హైద‌రాబాద్‌: చందానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వనందుకు ఓ యువతి వాచ్‌మన్‌ని చితకొట్టింది. ఈ సంఘటన చందానగర్‌లోని సిరి అపార్ట్‌మెంట్‌లో మంగళవారం చోటు చేసుకుంది. కారులో వచ్చిన ఓ యువతి అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అనుమతి లేకుండా అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లకూడదంటూ వాచ్ మెన్ ఆమెను అడ్డుకున్నాడు. దాంతో ఆ మ‌హిళ ఆగ్రహంతో కారు దిగి వచ్చి వాచ్‌‌మన్‌ మీద విచక్షణారహితంగా దాడి చేసింది. కాలితో త‌న్ని, చెప్పుతో కొట్టింది. ఈ దృశ్యాలన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. వాచ్‌మెన్ చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.