మతమార్పిడి చేస్తే బుల్లెట్ దింపుతం.. ఎంపీ సోయం బాపూరావు వార్నింగ్

మతమార్పిడి చేస్తే బుల్లెట్ దింపుతం.. ఎంపీ సోయం బాపూరావు వార్నింగ్

ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీలను మతమార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతామని.. ఆ పరిస్థితి రాకుండా పద్ధతి మార్చుకోవాలంటూ ఆదిలాబాద్​బీజేపీ ఎంపీ బాపూరావు హెచ్చరించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్​లీల మైదానంలో జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో గిరిజన సాంసృతిక పరిరక్షణ సభలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతాల్లో ముస్లింలు, క్రిస్టియన్లు ఆదివాసీ ఆడపిల్లలను మాయ మాటలతో మతం మారుస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగం వచ్చిన ఆదివాసీ ఆడ పిల్లలు టార్గెట్​గా ఈ మత మార్పిడి కొనసాగుతోందని మండిపడ్డారు. మతం మారిన ఆదివాసీలకు ఎస్టీ హోదా తొలగించాలని డిమాండ్ చేశారు. ‘‘ఆదివాసీలకు జ్వరం వస్తే నీళ్లలో పారాసిటమోల్‌‌‌‌ టాబ్లెట్‌‌‌‌ వేసి దైవజలం(హోలీ వాటర్) అంటూ తాగించి.. తగ్గిన తర్వాత మతం మారేలా చేస్తున్నారు. అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదని, ఆదివాసీలు చైతన్యమై మత మార్పిడిలను వ్యతిరేకించాలె” అని పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమంలో మహారాష్ట్ర కిన్వట్, పాండ్రకవడ ఎమ్మెల్యేలు కేరం భీమ్​రావ్, సందీప్‌‌‌‌ దుర్వే, జన జాతి సురక్ష సమితి ఆల్‌‌‌‌ఇండియా వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ హెచ్‌‌‌‌కే నాగు తదితరులు పాల్గొన్నారు.