కశ్మీర్‌లో మరో ఇద్దరు నాన్‌లోకల్స్‌ను చంపేసిన్రు

కశ్మీర్‌లో మరో ఇద్దరు నాన్‌లోకల్స్‌ను చంపేసిన్రు

కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. శనివారం ఇద్దరు నాన్-కశ్మీరీలను చంపిన ఘటన మరువక ముందే ఆదివారం రాత్రి కుల్గాం వాన్ పో ఏరియాలో మరో ఇద్దరు బిహారీలను చంపేశారు టెర్రిరిస్టులు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిలిద్దరు రాజా రేశి దేవ్, జోగిందర్ రేశిగా గుర్తించారు. గాయపడిన చున్ రేసి దాస్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. వీళ్లు అద్దెకు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజా రేశి దేవ్, జోగిందర్ రేశి అక్కడికక్కడే చనిపోయారు. దాడి జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి భద్రతా బలగాలు. 24 గంటల వ్యవధిలో జమ్ము కశ్మీర్ లో స్థానికేతరులపై జరిగిన మూడో దాడి ఇది. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బిహార్ సీఎం నితీష్ కుమార్. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. శనివారం కూడా ఇద్దరు పౌరులను కాల్చి చంపారు ఉగ్రవాదులు. శ్రీనగర్ ఈద్గా సమీపంలో బిహార్ కు చెందిన వీధి వ్యాపారి అరవింద్ కుమార్ ను కాల్చి చంపారు టెర్రరిస్టులు. అదే టైంలో పుల్వామాలో జరిపిన మరో దాడిలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సగిర్ అహ్మద్ ను పొట్టన పెట్టుకున్నారు. 

ఇక ఈ నెలలో టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన పౌరుల సంఖ్య 11కు చేరింది. ఇందులో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మృతుల్లో శ్రీనగర్ లో ఫార్మసీ నడుపుతున్న కశ్మీర్ పండిట్ మకన్ లాల్ బింద్రో, ట్యాక్సి డ్రైవర్ మహ్మద్ షఫి, టీచర్ దీపక్ చంద్, సుపుందర్ కౌర్, వీధి వ్యాపారి వీరేందర్ పాశ్వాన్ ఉన్నారు. ఈ మొత్తం ఘటనలను పరిశీలిస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని కశ్మీర్ నుంచి తరిమేయాలని ఉగ్రవాదులు భావిస్తున్నారని చెప్తున్నారు కొందరు అధికారులు. 

టెర్రరిస్టుల దాడులతో అప్రమత్తమైన జమ్ము కశ్మీర్ పోలీసులు...కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. వేర్పాటువాదులతో సంబంధాలున్నాయన్న కారణంతో 900 మందిని అదుపులోకి తీసుకున్నారు. అటు భద్రతా బలగాలు సైతం యాంటి టెర్రర్ ఆపరేషన్స్ ప్రారంభించాయి.  గత వారం రోజుల్లో 9 ఎన్ కౌంటర్లలో 13 మంది ఉగ్రవాదులను కాల్చి చంపాయి.