ఈవీ కంపెనీలకు నితిన్ గడ్కరీ వార్నింగ్

ఈవీ కంపెనీలకు నితిన్ గడ్కరీ వార్నింగ్

న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలను తయారు చేసే కంపెనీలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చారు. కరెంట్ బండ్లలో వాహనాలు మంటలు చెలరేగడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలపై ఆయన స్పందించారు. విద్యుత్ వాహనాల తయారీలో తప్పక నాణ్యత పాటించాలని లేకపోతే భారీ జరిమానాలు విధిస్తామన్నారు. దీంతోపాటు వాహనాలను రీకాల్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

గత రెండు నెలల్లో కరెంటు బండ్లలో పలు సమస్యలు రావడం, ప్రమాదాలు తలెత్తడం తన దృష్టికి వచ్చిందని గడ్కరీ తెలిపారు. ఈ ప్రమాదాల్లో కొందరు గాయాలపాలవ్వడం, మరికొందరు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. వాహనాల తయారీలో ఈవీ కంపెనీలు నాణ్యత పాటించాల్సిందేనన్నారు. వాహనదారుల భద్రతకు మోడీ సర్కారు కట్టుబడి ఉందని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం:

మాజీ భార్యపై రూ.380 కోట్ల పరువు నష్టం దావా 

వివాదాస్పద ట్వీట్.. జిగ్నేశ్ మేవానీ అరెస్ట్

విజయ్ దేవరకొండ, సమంత జోడీగా కొత్త సినిమా షురూ