
ప్రముఖ హాలీవుడ్ హీరో జానీ డెప్ తన మాజీ భార్య ఆంబర్ హెర్డ్ పై పరువు నష్టం దావా వేశాడు. తాను గృహ హింస బాధితురాలినంటూ ఆంబర్ రాసిన వ్యాసంపై జానీ డెప్ 50 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారుగా రూ.380 కోట్లు) పరువు నష్టం దావా వేశాడు. తాను ఏరకంగానూ ఆమెను హింసించలేదని డెప్ తెలిపాడు. ఆంబర్ వైపు నుంచి తీవ్ర ద్వేషాన్ని చవిచూశానని డెప్ తన వాంగ్మూలంలో చెప్పాడు.
ఆంబర్ తనను తరచూ అవమానించేదని, దుర్భాషలాడేదని వర్జీనియా కోర్టులో డెప్ వాపోయాడు. ‘టీవీ రిమోట్, వైన్ గ్లాస్ ను తను నా తలపై విసిరేది’ అని డెప్ అన్నాడు. అయితే డెప్ తనను హింసించే వాడని ఆరోపిస్తూ ఆంబర్ 100 మిలియన్ డాలర్ల ( మన కరెన్సీలో సుమారుగా రూ.760 కోట్లు) పరువునష్టం క్లెయిమ్ చేస్తూ ఎదురు కేసు వేసింది. ఈ కేసులో సాక్షిగా ఎలన్ మస్క్ ను కోర్టు విచారించనుంది. కాగా, ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో జానీ డెప్ ఎంతో క్రేజ్ సంపాదించారు.
మరిన్ని వార్తల కోసం: