వాషింగ్టన్: తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 8 యుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గురువారం ఆయన వైట్ హౌస్ నుంచి అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. 2026 ఏడాది కోసం తన పరిపాలన, ఆర్థిక, విదేశాంగ, ఇమ్మిగ్రేషన్, హౌసింగ్ వంటి అంశాలపై ప్రణాళికలను వివరించారు.‘‘నేను టారిఫ్ విధానాల ద్వారానే యుద్ధాలను ఆపగలిగాను.
అందుకే నాకు టారిఫ్ అనే పదం చాలా ఇష్టం. అమెరికాకు విదేశీ కంపెనీల నుంచి 22 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించాను. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాను. అంతేకాకుండా, దేశంలోని 14,50,000 మంది సైనికులకు క్రిస్మస్ కానుకగా 'వారియర్ డివిడెండ్' ప్రకటించారు. ప్రతి సైనికుడికి 1,776 డాలర్లు(రూ.1,49,000) చొప్పున ఇస్తామన్నారు.
