లింగాపూర్ - పంప్హౌస్ మధ్య కనిపించిన పెద్దపులి పాదముద్రలు

లింగాపూర్ - పంప్హౌస్ మధ్య కనిపించిన పెద్దపులి పాదముద్రలు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో  పెద్దపులి జాడ కోసం అటవీశాఖ పెద్దపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి తిరుమల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు తిరుగుతున్నాయి.  గురువారం  లింగాపూర్ నుంచి పంప్​హౌస్​కు వెళ్లే దారిలో పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో ట్రాప్ కెమెరాలను అమర్చారు.

పెద్దపులి సమాచారం తెలిస్తే ఫారెస్ట్, పోలీస్ అధికారులకు తెలపాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి సతీశ్ కుమార్ సూచించారు.  గ్రామాల్లో చాటింపులు వేయిస్తున్నారు. రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. డిప్యూటీ రేంజ్​ ఆఫీసర్లు సీహెచ్​స్వాతి, జి.కొమురయ్య, పి.దేవదాసు, ఎఫ్​ఎస్​ఓలు సయ్యద్​రహ్మతుల్లా, ఎ.వినయ్​కుమార్​, బీట్​ఆఫీసర్లు జి.రామ్మూర్తి, ఎ.మాధురి ఉన్నారు.