కోరుట్లలో కాంగ్రెస్ మహిళా నేత ఇద్దరు బీజేపీ నేతల కంటతడి

కోరుట్లలో కాంగ్రెస్ మహిళా నేత ఇద్దరు బీజేపీ నేతల కంటతడి

జగిత్యాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల టికెట్లు దక్కకపోవడంతో కొందరు కన్నీటి పర్యంతం కాగా, పార్టీ పదవులకు  కొందరు రాజీనామా చేశారు. మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపాలిటీలో 24వ వార్డు కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత జగిత్యాలలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో కన్నీటి పర్యంతమయ్యారు.

ఆమె మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఫోన్ చేసి బీఫామ్‌‌‌‌‌‌‌‌ తీసుకెళ్లమని చెప్పారని, కానీ తీరా లిస్టులో తన పేరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జువ్వాడి నర్సింగరావును అడిగితే తానేమీ చేయలేనని చెప్పారంటూ రోదించారు.

అలాగే కోరుట్లలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మరాణి 22వ వార్డు నుంచి టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాలకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్ రాజు భార్య అరవ లక్ష్మి, తాజా మాజీ కౌన్సిలర్ పులి రాముకు కూడా టికెట్ రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై కన్నీటి పర్యంతమయ్యారు.