రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ దే గెలుపు

రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ దే గెలుపు
  • 5న గుమ్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డి 
  • డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే, మేడిపల్లి సత్యం

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ దే గెలుపని, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, పంచాయతీ ఎన్నికల్లో విజయాలే అందుకు నిదర్శనమని  చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

కరీంనగర్ జిల్లాలో కార్పొరేషన్ తో పాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయబోతున్నదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రితో అభ్యర్థులను బరిలో నిలిపి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు సీట్లు రాకుండా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. భూకబ్జాలకు పాల్పడినవారు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి మళ్లీ బరిలోకి దిగుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా స్థాయి బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని, ఆ సభను సక్సెస్ చేయాలని కోరారు.  సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం పాల్గొన్నారు. 

 మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తా..

గంగాధర, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని, మౌలిక వసతుల కల్పనకు తనవంతు సహకరిస్తానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లి హైస్కూల్​లో టాయిలెట్స్, లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

చొప్పదండి నియోజకవర్గంలోని కొత్త పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తానన్నారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి స్కూల్‌‌‌‌‌‌‌‌లో లైబ్రరీ ఏర్పాటుకు సహకరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ దూలం కల్యాణ్, తహశీల్దార్ రజిత, ఎంపీడీవో రాము, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నగేశ్‌‌‌‌‌‌‌‌, ఉప సర్పంచ్ తిరుపతి, లీడర్లు అజయ్​రావు, శ్రీనివాస్, అంజయ్య, గంగన్న పాల్గొన్నారు.