- రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్కు అనుమతి తీసుకోనందుకు చర్యలు
కూకట్ పల్లి, వెలుగు: ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ మూవీ సాంగ్ రిలీజ్ఈవెంట్ ను అనుమతి లేకుండా నిర్వహించారంటూ నిర్వాహకులు, లులు మాల్ యాజమాన్యం, శ్రేయస్ మీడియాపై కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన ఈ ప్రోగ్రామ్లో హీరోయిన్ నిధి అగర్వాల్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
దీంతో ఆమె అసౌకర్యానికి గురయ్యారు. సంబంధిత వీడియోలు గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. నిర్వాహకులు ఈవెంట్ కు అనుమతి తీసుకోనందుకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
