భర్త వీల్ చైర్ లో.. పిల్లలు లేరు.. 60 ఏళ్ల మహిళను చంపిన కిరాతకుడు

 భర్త వీల్ చైర్ లో.. పిల్లలు లేరు.. 60 ఏళ్ల మహిళను చంపిన కిరాతకుడు

బెంగళూరులోని నేలమంగళలో మనసును కలిచివేసే ఘటన జరిగింది. 60 ఏళ్ల శోభ అనే వృద్ధురాలు తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురైంది. 12 ఏళ్లుగా పక్షవాతంతో వీల్‌చైర్‌కే పరిమితమైన ఆమె భర్త, కళ్లెదుటే జరుగుతున్న దారుణాన్ని చూస్తూ ఎం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభ అనే మహిళా తన భర్తతో కలిసి నివసిస్తుంది. ఈ దంపతులకు పిల్లలు లేరు.  అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసుకుంటూనే శోభ ఒంటరిగా ఇంటిని చూసుకుంటుంది. 

మంగళవారం సాయంత్రం శోభ మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా, ఆమె  వేసుకున్న బంగారు నగలు చూసి ఆమెని నిందితుడు వెంబడించాడు. ఇంటి దగ్గరకు  రాగానే దాహంగా ఉంది, కొన్ని నీళ్లు ఇస్తారా ? అని ఆమెను అడిగాడు. శోభ నీళ్లు తేవడానికి లోపలికి వెళ్లగానే, వెనుక నుంచి వెళ్లి కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. తరువాత  ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకుని అక్కడి నుండి పారిపోయాడు.

ఎలా బయటపడిందంటే: 
రోజూ భర్తకు ఫిజియోథెరపీ చేయడానికి వచ్చే డాక్టర్, మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శోభ రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దింతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసి శివకుమార్ (35) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతను ఒక హోల్‌సేల్ షాపు యజమాని.

 నిందితుడికి దాదాపు రూ.8 లక్షల అప్పు ఉంది. ఆ అప్పు తీర్చడానికి డబ్బు కావాల్సి వచ్చి, ఈ వృద్ధురాలిని టార్గెట్  చేసి హత్య చేశాడు. హత్యా జరిగిన తరువాత  నిందితుడి స్కూటి  (Activa) నంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేసి పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి స్కూటర్, హత్యకు వాడిన కత్తి, ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.