Vijay-Rashmika Wedding: విజయ్-రష్మికల పెళ్లిపై బయటకు వచ్చిన లీక్స్.. ఏం జరుగుతుందంటే?

Vijay-Rashmika Wedding: విజయ్-రష్మికల పెళ్లిపై బయటకు వచ్చిన లీక్స్.. ఏం జరుగుతుందంటే?

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ జంట వివాహం గురించి కొన్ని రోజులులగా నెట్టింట మారుమోగిపోతోంది. గత కొన్నేళ్లు వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి మరో వారం రోజుల్లో ఫుల్ స్టాప్ పడబోతోంది. ఈ కపుల్ పెళ్లి గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లి తేదీ, వేదిక, అతిథుల వివరాలు బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

రాజస్థాన్ వేదికగా రాయల్ వెడ్డింగ్!

ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పూర్‌లో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య కేవలం కొద్దిమంది అతిథులతో మాత్రమే ప్రైవేట్‌గా జరగనుంది. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఈ వేడుకలకు మీడియాను అనుమతించడం లేదు. ఈ జంట తమ వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లిపై ఇంతవరకు విజయ్- రష్మికలు అధికారికంగా ప్రకటించలేదు. సన్నిహిత వర్గాల నుంచి మాత్రమే సమాచారం బయటకు వస్తోంది.

 ప్రైవసీకి భంగం!

పెళ్లి వార్త సంతోషాన్ని కలిగించినప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని ప్రచారాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు ఉత్సాహవంతులు పెళ్లి పత్రికను, అందులో ఉన్న వివరాలను యథాతథంగా ఇంటర్నెట్‌లో షేర్ చేస్తుండటంపై విజయ్ రష్మికల టీమ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వివాహ ఆహ్వాన పత్రికపై అతిథుల సౌకర్యార్థం ముద్రించిన ఫోన్ నెంబర్లను కూడా కొందరు పబ్లిక్‌గా షేర్ చేయడం సరికాదని పేర్కొంటోంది. దీనివల్ల ఆ నెంబర్లకు వేల సంఖ్యలో కాల్స్ వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అతిథుల, నిర్వాహకుల ప్రైవసీని దెబ్బతీస్తుందని సూచిస్తున్నారు.. పెళ్లి తేదీ, సమయం, రూమ్ నెంబర్ల వంటి సున్నితమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడం వల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి వ్యక్తిగత విషయం

సినిమా స్టార్లు పబ్లిక్ ఫిగర్స్ అయినప్పటికీ, వివాహం అనేది పూర్తిగా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం. రాజకీయ ప్రముఖులు, సినీ దిగ్గజాలు హాజరయ్యే ఇలాంటి వేడుకల్లో గోప్యత పాటించడం చాలా అవసరం. అభిమానులు తమ అభిమానాన్ని చాటుకోవడంలో తప్పులేదు కానీ, అది వారి ప్రైవసీని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. సోషల్ మీడియాలో సమాచారాన్ని షేర్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలని విజయ్ సన్నిహితలు సూచిస్తున్నారు.

త్వరలోనే అధికారిక ప్రకటన?

పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఈ జంట ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ వారు అధికారికంగా తమ ఫోటోలను షేర్ చేస్తూ, మీడియాతో ముచ్చటించే అవకాశం ఉంది. "రౌడీ" హీరో , "నేషనల్ క్రష్" ఒకటవుతున్నారంటూ వస్తున్న కథనాలతో  నెట్టింట వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.