CULT Teaser: రియల్ ఇన్సిడెంట్స్‌తో మాసివ్ థ్రిల్లర్.. విశ్వక్ సేన్ ‘కల్ట్’ టీజర్ డేట్ ఫిక్స్!

CULT Teaser: రియల్ ఇన్సిడెంట్స్‌తో మాసివ్ థ్రిల్లర్.. విశ్వక్ సేన్ ‘కల్ట్’ టీజర్ డేట్ ఫిక్స్!

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్పీడు పెంచుతున్నాడు విశ్వక్ సేన్. అయితే వరుస ఫెయిల్యూర్స్ కూడా ఆయనను వెంటాడుతున్నాయి. ఇటీవల జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి చేసిన కామెడీ జానర్ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే విశ్వక్ ఖాతాలో మరో డిస్సపాయింట్ మూవీ వచ్చిందనే ఆలోచనని ఫ్యాన్స్ కి ఇచ్చాడు.

విశ్వక్ గత చిత్రాలను పరిశీలిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ, లైలా, ఫంకీ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ క్రమంలోనే తన కొత్త ప్రాజెక్టులతో పుంజుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే ఎలాగైనా తన డైరెక్షన్ లోనే సాలిడ్ హిట్ కొట్టేయాలని డిసైడ్ అయ్యాడు. 

లేటెస్ట్ విషయానికి వస్తే.. రచయితగా, దర్శక నిర్మాతగా తానెంటో ప్రూవ్ చేసుకున్న విశ్వక్.. మరోసారి మెగా ఫోన్ పట్టాడు. హీరోగా, దర్శకుడిగా ఇప్పటికే రెండు చిత్రాలను రూపొందించగా, ఇప్పుడు ‘కల్ట్’  మూవీతో వస్తున్నాడు. ఇందులో తాను హీరోగా నటిస్తూ దర్శకత్వం చేయనున్నాడు. తన సొంత బ్యానర్  వన్మయి’ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆయన తండ్రి కరాటే రాజుతో కలిసి సందీప్ కాకర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే, ‘కల్ట్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే  ‘కల్ట్’ టీజర్ అప్డేట్ ఇచ్చాడు విశ్వక్. రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌తో న్యూ ఏజ్ థ్రిల్లర్‌‌‌‌గా వస్తోన్న ఈ మూవీ టీజర్ ఫిబ్రవరి 21న రిలీజ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ కల్ట్ మాసివ్ థ్రిల్లింగ్ గెటప్లో కనిపిస్తున్నాడు. దానికి తోడు చేతిలో నికార్సయిన కత్తి, చుట్టూ రక్తసిక్త దృశ్యాలు భారీ ఇంపాక్ట్  పోస్టర్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోన్నాయి

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలను విశ్వక్ స్వయంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.