బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ తమ్ముడు ఆండ్రూ మౌంట్ బాటెన్-విండ్సర్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రభుత్వ కార్యాలయంలో తప్పుడు పనులకు పాల్పడ్డారనే అనుమానంతో గురువారం ఈయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టుకు కారణాలు చూస్తే ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్య విషయాలని జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తికి పంపారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
జెఫ్రీ ఎప్స్టీన్ ఒకప్పుడు లైంగిక నేరస్థుడిగా శిక్ష అనుభవించిన వ్యక్తి. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైళ్ల ప్రకారం, ఆండ్రూ అతనికి కీలక విషయాల ఫైల్స్ అందించారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఆరోపణల మీద థేమ్స్ వ్యాలీ పోలీసులు ఈ నెల మొదటి నుండే విచారణ చేస్తున్నారు. చివరకు తగిన ఆధారాలు ఉండటంతో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆండ్రూ మౌంట్ ఇంతకుముందు బ్రిటన్ (UK) తరపున అమెరికాలో వాణిజ్య రాయబారిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనకు జెఫ్రీ ఎప్స్టీన్‌తో పరిచయం ఏర్పడింది. ఎప్స్టీన్ ఇచ్చే విలాసవంతమైన పార్టీలకు ఆండ్రూ తరచుగా హాజరయ్యేవారు.
అయితే, ఎప్స్టీన్ సాయంతో ఆండ్రూ ఇంగ్లాండ్‌కు అక్రమంగా యువతులను తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆ యువతులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాల్లోనే రాసలీలలకు పాల్పడ్డారని తెలుస్తోంది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన 'ఎప్స్టీన్ ఫైల్స్' ద్వారా ఈ షాకింగ్ విషయాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి.
