సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’ (Varanasi). ఇప్పుడు ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే అభిమానులతో పాటు సినీ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి.
సినిమా టైటిల్‌ను రివీల్ చేసిన గ్లింప్స్ దగ్గర నుంచి ప్రతి పాత్రకు సంబంధించిన విషయంపై సినీ ప్రియులు ఆరా తీయడం స్టార్ట్ చేసారు. ఎందుకంటే ఈ సినిమాకు పురాణాల టచ్ ఇవ్వబోతున్నాడనే క్లారిటీ ఇవ్వడంతోనే మరింత ఆసక్తి పెరిగింది. ఇందులో భాగంగానే వారణాసిలో ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారు? వారి ఇంపార్టెన్స్ ఎంత అనేది ఆడియన్స్ చర్చించుకుంటున్నారు.
ఐదు గెటప్స్‌లో మహేష్ బాబు!
రాజమౌళి విజన్ ప్రకారం, 'వారణాసి' చిత్రంలో మహేష్ బాబు ఏకంగా 5 విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారనేది టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే బయటకు వచ్చిన రుద్రుడు, శ్రీరాముడి లుక్స్‌తో పాటు, ఇంకా మూడు సరికొత్త రూపాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.
ALSO READ : ఓటీటీలోకి 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు'..
జక్కన్న మాస్టర్ ప్లాన్‌లో భాగంగా, మహేష్ బాబును అభిమానులు ఇప్పటివరకు చూడని రీతిలో, ఒక విజువల్ వండర్‌గా, సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ అవతారాలలో తెరపై చూపించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే వీటిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. రాజమౌళి తన సినిమాలలో హీరో పాత్రను ఎలివేట్ చేయడంలో, వారికి విభిన్నమైన లుక్స్ ఇవ్వడంలో సిద్ధహస్తుడు. 'బాహుబలి'లో ప్రభాస్‌ను శివుడి అవతారంలో, 'RRR'లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు విప్లవ వీరుల గెటప్‌లను చూపించారు.
ALSO READ : 'ది కేరళ స్టోరీ-2' మూవీపై సీఎం విజయన్ ఫైర్!
ఇప్పుడు 'వారణాసి'లో మహేష్ బాబుకు ఏకంగా 5 అవతారాలను డిజైన్ చేశారంటే, ఆ పాత్ర పరిధి, కథనం యొక్క డెప్త్ ఎంత గొప్పగా ఉండబోతుందో ఊహించవచ్చు. అయితే, ఇది కేవలం లుక్స్ మార్పు మాత్రమే కాదు, కథనంలో వచ్చే వివిధ దశలు లేదా కాలాలకు సంబంధించిన ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.
Mahesh Babu as RUDHRA in #VARANASI. pic.twitter.com/YMUjnnytWX
— rajamouli ss (@ssrajamouli) November 15, 2025
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ‘కుంభ’ అనే శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇతిహాస గాథ రామాయణంలో కుంభకర్ణుడి కుమారుల్లో ‘కుంభుడు’ ఒకరు. రామ-రావణ యుద్ధంలో రాముడిపై పోరాడి హనుమంతుడి చేతిలో మరణించిన పరాక్రమవంతుడిగా ఆయన ప్రస్తావన ఉంది.
అలాగే ‘కుంభ’కు “అమృతాన్ని ధరించిన పాత్ర” అనే అర్థం కూడా ఉంది. క్షీరసాగర మథనం అనంతరం లభించిన అమృతాన్ని నిల్వ చేసిన పాత్రను కుంభగా పిలుస్తారు. ఈ పురాణ సింబాలిజంతో కూడిన పాత్రలో పృథ్వీరాజ్ కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
After canning the first shot with Prithvi, I walked up to him and said you are one of the finest actors I’ve ever known.
— rajamouli ss (@ssrajamouli) November 7, 2025
Bringing life to this sinister, ruthless, powerful antagonist KUMBHA was creatively very satisfying.
Thank you Prithvi for slipping into his chair…… pic.twitter.com/E6OVBK1QUS
శివ భక్తునిగా ప్రకాష్ రాజ్
విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో మహా శివ భక్తుడి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. మహేష్ బాబుకు తండ్రిగా కనిపించనున్న ఆయన పాత్ర ఆధ్యాత్మికతతో కూడిన శక్తివంతమైనది అని సమాచారం. వారణాసి నేపథ్యంలోని ఈ కథలో ఆయన పాత్ర కీలకంగా ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా..
బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో ‘మందాకిని’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ‘మందాకిని’ అనేది శివుడి జటాలో ప్రవహించే గంగకు మరో పేరు. ఈ పేరుతోనే ఆమె పాత్రలో పురాణ సింబాలిజం స్పష్టమవుతోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పసుపు రంగు చీరలో, చేతిలో పిస్టల్‌తో కనిపించిన ఆమె లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రాజమౌళి మార్క్ హీరోయిన్‌గా యాక్షన్ ప్రధాన పాత్రలో ఆమె కనిపించనున్నారని సమాచారం.
The woman who redefined Indian Cinema on the global stage. Welcome back, Desi Girl! @priyankachopra
— rajamouli ss (@ssrajamouli) November 12, 2025
Can’t wait for the world to witness your myriad shades of MANDAKINI.#GlobeTrotter pic.twitter.com/br4APC6Tb1
హనుమంతుడి పాత్రలో ఆర్. మాధవన్..
రాముడిగా మహేష్ బాబు, హనుమంతుడిగా మాధవన్ అనే కాంబినేషన్ ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, తమిళ స్టార్ ఆర్. మాధవన్ ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మొదట మహేష్ బాబు తండ్రి పాత్రలో నటిస్తున్నారనే టాక్ వచ్చినా, ఇప్పుడు హనుమంతుడి పాత్రే చేస్తున్నారనే అప్డేట్స్ వస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తంగా ‘వారణాసి’ చిత్రం పురాణాల టచ్‌తో, శక్తివంతమైన పాత్రలతో, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా మారబోతోందని తెలుస్తోంది.
2027 శ్రీరామనవమికి 'మహా జాతర'!
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9, 2027న శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 1,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ వండర్.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
వారణాసి ఘాట్‌ల నుంచి ఆఫ్రికా అడవుల వరకు, అంటార్కిటికా మంచు కొండల నుంచి త్రేతాయుగం నాటి యుద్ధభూమి వరకు.. రాజమౌళి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. మరి ఈ గ్లోబల్ అడ్వెంచర్ ఇండియన్ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి!
