హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను వాయిదా వేయాలని బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్ శ్రీదేవసేనకు ఆయన లేఖ రాశారు. 20 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల నిర్వహణలో టీచర్లు శారీరక, మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలిపారు.
ఈ బిజీ షెడ్యూల్ కారణంగా టెట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు వారికి తగిన సమయం దొరకలేదని ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టెట్‌ను వాయిదా వేయాలని కోరారు.
