చల్లబడ్డ బంగారం, వెండి.. తగ్గిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..

చల్లబడ్డ బంగారం, వెండి.. తగ్గిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..

బంగారం ధరలు శుక్రవారం 19 రోజున  చల్లబడ్డాయి. నిన్న మొన్నటితో పోల్చితే ప్రస్తుతం 1 గ్రాము  బంగారం ధర రూ.600 పైగా తగ్గింది, ఇక వెండి ధర కూడా ఈ రోజు  2 వేలు పడిపోయింది. అయితే బంగారం వెండి ధర ఇంతలా పెరగడానికి తగ్గడానికి  ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్లోని కొన్ని కీలక పరిణామాలు కారణమని చెప్పొచ్చు.  అమెరికా కేంద్ర బ్యాంక్ (ఫెడ్) వడ్డీ రేట్లను తగ్గించడం బంగారం ధరల పెరుగుదలకు ముఖ్య కారణం కాగా...   గత కొన్ని వారాలుగా డాలర్ విలువ వరుసగా క్షీణిస్తోంది. సాధారణంగా డాలర్ బలహీనపడినప్పుడు పెట్టుబడిదారులకు బంగారం చౌకగా అనిపించి దానిపై పెట్టుబడులు పెంచుతారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. అలాగే  డాలర్ విలువ తగ్గి, అమెరికా ట్రెజరీ బాండ్లపై వచ్చే ఆదాయం తగ్గినప్పుడు.. పెట్టుబడిదారుల పెట్టుబడి సురక్షితంగా ఉంచుకోవడానికి బంగారం వైపు చూస్తారు. 

ఇవాళ  1గ్రాము 24K బంగారం ధర రూ.66 తగ్గి రూ.13,418, 22K  ధర రూ. 60 తగ్గి రూ. 12,300, 18K ధర రూ. 49 తగ్గి  రూ.10,064. 

10గ్రాముల 24K  ధర రూ.660 తగ్గి  రూ.1,34,180, 22K ధర రూ.600 తగ్గి రూ.1,23,000, 18K ధర రూ. 490  తగ్గి రూ.1,00,640    

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10గ్రాముల  24క్యారెట్ల ధర  రూ.1,34,180, 22 క్యారెట్ల ధర  రూ.1,23,000, 18 క్యారెట్ల ధర రూ.1,00,640    

ALSO READ : కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కు రూ. కోటి ఫైన్

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం 10గ్రాముల  24క్యారెట్ల ధర  రూ.1,34,180, 22 క్యారెట్ల ధర  రూ.1,23,000, 18 క్యారెట్ల ధర రూ.1,00,640. ఇక తెలుగు రాష్ట్రాల్లో  వెండి 1గ్రాము   ధర రూ.2 తగ్గి  రూ.209, అలాగే కేజీ ధర రూ.2 వేలు తగ్గి రూ.2,09,000