హైదరాబాద్–బెంగళూరు రూట్ లో..ఇన్ట్రిసిటీ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైడ్ బస్సు సర్వీసులు

హైదరాబాద్–బెంగళూరు రూట్ లో..ఇన్ట్రిసిటీ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైడ్ బస్సు సర్వీసులు
  • ఇన్​ట్రిసిటీ బస్సుల్లోస్వచ్ఛమైన గాలి

హైదరాబాద్, వెలుగు: ఇన్​ట్రిసిటీ స్మార్ట్ బస్ తన తొలి ఎయిర్ ప్యూరిఫైడ్ బస్సు సేవలను హైదరాబాద్–బెంగళూరు మార్గంలో ప్రారంభించింది. స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఈ బస్సుల్లో ఎయిర్​ఫిల్టర్​ సిస్టమ్​ను ఏర్పాటు చేశారు. బయటి గాలితో పోలిస్తే లోపల గాలి నాణ్యత ఐదు రెట్లు మెరుగ్గా ఉంటుంది. 

రెసిపైరర్ లివింగ్ సైన్సెస్ సహకారంతో ఈ టెక్నాలజీని తీసుకువచ్చారు. ప్రయాణికులు యాప్ ద్వారా గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.