కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కు రూ. కోటి ఫైన్

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కు రూ. కోటి ఫైన్

న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ  ఐఆర్‌‌‌‌‌‌‌‌డీఏఐ కేర్‌‌‌‌‌‌‌‌ హెల్త్ ఇన్సూరెన్స్​కు రూ.కోటి జరిమానా వేసింది. క్లెయిమ్ సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌లో పారదర్శకత లేకపోవడం, పాలసీహోల్డర్ల హక్కులను ఉల్లంఘించడం, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలే ఇందుకు కారణం. 

ఫిర్యాదులను పరిష్కరించకపోవడం, సైబర్‌‌‌‌ సెక్యూరిటీ లోపాలు, రీఇన్సూరెన్స్ అకౌంటింగ్‌‌‌‌లో తప్పులు, అలాగే గుర్తించని ప్రపోజల్ డిపాజిట్లను సరిగా నిర్వహించకపోవడం వంటివి బయటపడ్డాయి.  

ముఖ్యంగా క్యాష్‌‌‌‌లెస్ క్లెయిమ్‌‌‌‌లలో 69శాతం కేసుల్లో తప్పనిసరి డాక్యుమెంటేషన్ లేకపోవడం, డిస్కౌంట్‌‌‌‌లు పాలసీహోల్డర్లకు తెలియజేయకపోవడం, ఆసుపత్రి బిల్లులు, సెటిల్‌‌‌‌మెంట్ మధ్య తేడా ఉండటంపై ఐఆర్​డీఏఐ మండిపడింది.