'సీతారామం' తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'సీత'గా స్థిరపడిపోయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం వరుస సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. వాలెంటూన్స్ డే రోజు ( ఫిబ్రవరి 14) వీరి వివాహం అంటూ కథనాలతో సోషల్ మీడియాలో హోరెత్తించారు. వీటన్నింటిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేచారు మృణాల్.
సరైన సమయంలో సరైన వ్యక్తితో..
లేటెస్ట్ గా మృణాల్ ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ పై గట్టిగానే స్పందించారు. వివాహం అనేది తన జీవిత ప్రణాళికలో ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. సరైన సమయం వచ్చినప్పుడు, సరైన వ్యక్తి నా జీవితంలోకి ప్రవేశించినప్పుడు తప్పక పెళ్లి చేసుకుంటా. ఈ విషయాన్ని నేనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తా అని స్పష్టం చేసింది. పూర్వం సామాజిక ఒత్తిడి వల్లో.. ఇతర కారణాల వల్లో వివాహం చేసుకునేవారు. కానీ నేటి తరం ఆలోచన విధానం మారింది. జెన్యూన్ కనెక్షన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం పెళ్లి చేసుకోవాలి కాబట్టి కాకుండా.. తనకు నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం ముఖ్యం అని మృణాల్ తన అభిప్రాయాన్ని పంచుకుంది.
ధనుష్‌తో పెళ్లిపై..
ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే సందర్భంగా మృణాల్, ధనుష్ రహస్యంగా వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా షికారు చేశాయి. ఈ రూమర్లపై స్పందిస్తూ ఆమె సెటైరికల్‌గా సమాధానమిచ్చింది. "నాకు తెలియకుండానే నేను స్టేట్‌మెంట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 14ని నాకు ఏప్రిల్ 1 (ఏప్రిల్ ఫూల్స్ డే)గా మార్చేశారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చూస్తుంటే భయమేస్తోంది అని మృణాల్ ఆవేదన వ్యక్తం చేసింది.
కెరీర్ పై దృష్టి..
ప్రస్తుతం తన దృష్టి కెరీర్ పై ఉందని మృణాల్ స్పష్టి చేసింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఈ ముద్దుగుమ్మ.. సిద్ధాంత చతుర్వేది సరసన ఆమె నటించిన రొమాంటిక్ డ్రామా ‘దో దీవానే షెహర్ మే’ విడుదలకు సిద్ధంగా ఉంది. రవి ఉద్యావర్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. శశాంక్, రోష్ని అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే 'ఇంపర్ఫెక్ట్ లవ్ స్టోరీ'గా ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ మాటలను బట్టి చూస్తే.. పెళ్లి పీటలు ఎక్కడానికి ఆమె సిద్ధమే కానీ, అది కేవలం మనసు కలిసిన వ్యక్తితోనే అని తేల్చి చెప్పేసింది. మరి ఆ 'మిస్టర్ పర్ఫెక్ట్' ఎప్పుడు దొరుకుతాడో వేచి చూడాలి!
