గద్వాల, వెలుగు: అందరి సహకారంతో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘా. బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలు, మీడియా, ఎన్నికల ఆఫీసర్లు సహకరించారని తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ పడేందుకు అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కరించుకోవాలన్నారు.
