- బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్రావు
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనతో కార్యకర్తల్లో ఉత్సాహం మరింత పెరుగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. ఈ నెల 4న మహబూబ్ నగర్ లో ఉమ్మడి జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి నితిన్ నబీన్ హాజరుకానుండగా, ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ డీకే అరుణ, మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లర్ తో కలిసి పరిశీలించారు.
రాష్ట్రంలో బీజేపీకి మద్దతు పెరుగుతోందని, మెజార్టీ మున్సిపాలిటీల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందన్నారు. పాలమూరు కార్పొరేషన్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. జాతీయ అధ్యక్షుడి సభకు కార్యకర్తలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. చింతల రామచంద్రారెడ్డి, పద్మజ రెడ్డి, నాగురావు నామాజీ, దిలీప్ ఆచారి, రతంగ్ పాండురెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
