ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

మదనాపురం, వెలుగు: మున్సిపల్  ఎన్నికల్లో కాంగ్రెస్  బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. సోమవారం అమరచింత మున్సిపాలిటీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అమరచింతలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మున్సిపాలిటీకి రూ.20 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు.

మున్సిపల్  ఎన్నికల్లో కాంగ్రెస్​ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టికెట్​ రాని వారు నిరాశ చెందవద్దని, పార్టీ. నామినేటెడ్  పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి. నాగరాజ్  గౌడ్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.