మున్సిపల్  ఎన్నికల కు పటిష్ట భద్రత : ఎస్పీ జానకి

మున్సిపల్  ఎన్నికల కు పటిష్ట భద్రత : ఎస్పీ జానకి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్  ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా పోలీస్​ ఆఫీసర్లు బాధ్యతయుతంగా పని చేయాలని ఎస్పీ జానకి సూచించారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్  కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో సోమవారం జిల్లా పోలీస్  కార్యాలయంలో మీటింగ్​ నిర్వహించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్రిటికల్  పోలింగ్  స్టేషన్లలో అదనపు బలగాలు, క్విక్  రెస్పాన్స్  టీమ్స్​ సిద్ధంగా ఉంచాలని, అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని సూచించారు.

మక్తల్(నారాయణపేట): మున్సిపల్​ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నారాయణపేట ఎస్పీ వినీత్​ ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సోమవారం జిల్లా పోలీస్  అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.

ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. అక్రమంగా నగదు, మద్యం, ఇతర విలువైన వస్తువులు సరఫరా జరగకుండా చూడాలని ఆదేశించారు. అడిషనల్​ ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్  హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివ శంకర్, రాంలాల్, సైదులు, భగవంత్ రెడ్డి పాల్గొన్నారు.