బజాజ్ కొత్త ప్లాన్ ! పల్సర్ బైక్స్‌లో బిగ్ ఛేంజ్.. వచ్చే 5 నెలల్లో మారబోతున్న బైక్స్ !

బజాజ్ కొత్త ప్లాన్ ! పల్సర్ బైక్స్‌లో బిగ్ ఛేంజ్.. వచ్చే 5 నెలల్లో మారబోతున్న బైక్స్ !

బజాజ్ కంపెనీ ఫేమస్ 'పల్సర్' బ్రాండ్‌ను పూర్తిగా కొత్తగా మార్చబోతోంది. రాబోయే 4 నుండి 5 నెలల్లో పల్సర్ సిరీస్‌లో ఉన్న అన్ని బైక్స్‌ను అప్‌డేట్ చేసి, కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. దింతో  వచ్చే కొన్ని నెలల్లో పల్సర్ మోడల్స్ లో 8 రకాల మార్పులు లేదా కొత్త లాంచ్‌లు ఉండబోతున్నాయి.  ముఖ్యంగా 125cc కంటే ఎక్కువ పవర్ ఉన్న బైక్స్ విభాగంలో పట్టును పెంచుకోవాలని బజాజ్ చూస్తోంది.

మనకు తెలిసిన పాత పల్సర్ మోడల్స్, కొత్తగా వచ్చిన N-సిరీస్, స్పోర్టీగా ఉండే NS-సిరీస్.. ఇలా అన్నింటినీ బజాజ్ రిఫ్రెష్ చేస్తోంది. దింతో పాత, కొత్త మోడళ్లన్నీ మారుతాయి.  ఇప్పటికే గత రెండు నెలల్లో 7 రకాల అప్‌డేట్స్‌ను కంపెనీ తీసుకొచ్చింది. దీనివల్ల 150cc పైన ఉన్న బైక్స్ అమ్మకాలు బాగా పెరిగాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ రాకేష్ శర్మ తెలిపారు.

ALSO READ : ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..

 బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. ఈ 4-5 నెలల సమయం ముగిసేసరికి, పల్సర్ బ్రాండ్ మరింత శక్తివంతంగా మారుతుంది. పండుగ సీజన్ తర్వాత మేము స్పీడ్  పెంచాము. 150cc విభాగంలో మా మార్కెట్ పెరుగుతోంది అని అన్నారు.

మరోవైపు  పెట్రోల్ ధరలు, ఖర్చులు పెరగడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గుతుందేమోనని కంపెనీ కొంచెం ఆందోళన చెందుతోంది. బజాజ్ డొమినార్ బైక్స్‌కు ఇండియా కంటే మెక్సికో వంటి దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉందట.త్వరలో ఆన్-రోడ్ అండ్ ఆఫ్-రోడ్ బైక్స్‌ను కూడా తీసుకురావాలని కంపెనీ ఆలోచిస్తోంది. ఇందుకోసం పాత బ్రాండ్లను మళ్ళీ వాడే అవకాశం ఉంది.  మొత్తం చూస్తే  మరో 4 నెలల్లో అదిరిపోయే ఆప్షన్లు పల్సర్ బైక్స్ లో చూడొచ్చు.