గద్వాల, వెలుగు: గద్వాల మున్సిపాలిటీలో వేసిన నామినేషన్ల సంఖ్యపై గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ నుంచి 119 నామినేషన్లు దాఖలు కాగా, అధికారికంగా ప్రకటించిన లిస్ట్‌లో 42 మాత్రమే చూపడంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత భర్త తిరుపతయ్య సోమవారం రాత్రి మున్సిపల్ కమిషనర్ వద్దకు వచ్చి బైఠాయించారు. గద్వాల మున్సిపాలిటీలో 308 నామినేషన్లు దాఖలు కాగా, కాంగ్రెస్ నామినేషన్లను 42గా చూపిస్తున్నారని తెలిపారు. మిగిలిన నామినేషన్లు ఎందుకు చూపించడం లేదో అర్థం కావడం లేదన్నారు.
దీనిపై కలెక్టర్ కు కంప్లైంట్ చేస్తామని తెలిపారు. బీజేపీ నుంచి 50కి పైగా నామినేషన్లు వేస్తే, 42 మాత్రమే చూపిస్తున్నారని ఆ పార్టీ నాయకులు నిలదీశారు. కాంగ్రెస్ నుంచి 88 నామినేషన్లు వచ్చాయని, కొందరు ఆఫీసర్ల పొరపాటుతో ఇలా జరిగిందని మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ వివరణ ఇచ్చారు.
