డిసెంబర్ 23న సంగారెడ్డి జిల్లాలో అప్రెంటిస్ మేళా

డిసెంబర్ 23న సంగారెడ్డి జిల్లాలో అప్రెంటిస్ మేళా

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి ఈ నెల 23న సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో అప్రెంటిస్​మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్, మెకానిక్, మోటార్ వెహికల్, మిషినిస్ట్ కోర్సులు చేసినవారు అర్హులన్నారు.18 నుంచి 25 ఏళ్ల వయసున్నవారు ఆ రోజు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ , పాస్​పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.

పీఏసీఎస్​ చైర్మన్ పదవికి రాజీనామా

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి పీఏసీఎస్​చైర్మన్ పదవికి చింతల శ్రీనివాస్ గురువారం రాజీనామా చేశారు. ఆయన మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి గెలిచినందున పీఏసీఎస్​చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా కో-ఆపరేటివ్ అధికారికి అందజేసినట్లు పేర్కొన్నారు.