మణుగూరు పీకే ఓసీ 2 ప్రైవేటీకరణ ఆపాలి: కవిత

మణుగూరు పీకే ఓసీ 2 ప్రైవేటీకరణ ఆపాలి: కవిత

మణుగూరు పీకే ఓసీ 2 ప్రవేటికరణ ఆపాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు  కవిత, డిసెంబర్ 19న  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుల   జనం బాట కార్యక్రమంలో భాగంగా 2 వ రోజు మణుగూరు సింగరేణి ఓ.సి లో పర్యటించారు కవిత.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఓ.సి 2 వద్ద హెచ్ ఎం ఎస్ యూనియన్ గేట్ మీట్ లో పాల్గొని కార్మికుల తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం కాట్రాక్టు మహిళా కార్మికులతో కలిసి ఆమె టిఫిన్ చేస్తూ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. 

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత. మణుగూరు పీకే ఓసి 2 ప్రవేటికరణకు కేంద్రం టెండర్లు పిలుస్తుందని , ప్రయివేటికరణ జరిగితే మణుగూరు మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు.  సింగరేణి సి & ఎం డి ఇటీవల మాట్లాడిన మాటలు చూస్తే ఇంకా మూడు సంవత్సరాల్లో మణుగూరులో సింగరేణి ఉండదన్నారు.  ప్రజలు భయాందోళన చెందుతున్నారని ఎలాగైనా ఈ ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు.. అంతే కాకుండా ఇక్కడి ఓ.సి విస్తరణ బాధ్యతలు సింగరేణి కి ఇవ్వాలని కోరారు కవిత.  లేదంటే కార్మికుల పక్షాన హెచ్ఎంఎస్ తో కలిసి తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందన్నారు..ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ హెచ్ ఎం ఎస్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు..