Chandrahass: ఊహించలేని క్లైమాక్స్‌.. ‘బరాబర్ ప్రేమిస్తా’పై చంద్రహాస్ కాన్ఫిడెన్స్

Chandrahass: ఊహించలేని క్లైమాక్స్‌.. ‘బరాబర్ ప్రేమిస్తా’పై చంద్రహాస్ కాన్ఫిడెన్స్

చంద్రహాస్‌‌‌‌‌‌‌‌ హీరోగా సంపత్ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. మిస్ ఇండియా ఫైనలిస్ట్  మేఘన ముఖర్జీ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించగా, ‘ఇష్టంగా’ ఫేమ్  అర్జున్ మహీ విలన్‌‌‌‌‌‌‌‌గా నటించాడు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానుంది.

ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, ఆది సాయికుమార్,  జేడీ చక్రవర్తి, పూజా బేడీ, వంశీ నందిపాటి  ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు. చంద్రహాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. లెక్కపెట్టలేనన్ని, ఊహించలేనన్ని ట్విస్ట్‌‌‌‌‌‌‌‌లతో  ఉంటుంది’ అని చెప్పాడు.

బుజ్జి పాత్రలో అందరినీ అలరిస్తానని హీరోయిన్  మేఘన ముఖర్జీ చెప్పింది. దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ ‘తెలంగాణ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇందులోని  క్లైమాక్స్ చూసి అందరూ షాక్ అవుతారు’ అని అన్నాడు.

ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని నిర్మాతలు అన్నారు. నటుడు అర్జున్ మహీ, మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ పాల్గొన్నారు.