One By Four: మహిళల సమస్యలపై స్ట్రాంగ్ స్టాండ్... సోషల్ మెసేజ్‌తో ‘వన్ బై ఫోర్’ క్రైమ్ డ్రామా

One By Four: మహిళల సమస్యలపై స్ట్రాంగ్ స్టాండ్... సోషల్ మెసేజ్‌తో ‘వన్ బై ఫోర్’ క్రైమ్ డ్రామా

వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా ‘వన్ బై ఫోర్’. బ్లాక్‌‌‌‌‌‌‌‌బస్టర్ ‘బాహుబలి’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.  రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ కలిసి నిర్మించారు.

ఇటీవల రిలీజైన ఈ చిత్రానికి సంబంధించి సోమవారం ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు. హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ ‘అడ్డంకులన్నీ దాటుకుని ఇటీవల సినిమాను విడుదల చేశాం. అన్ని థియేటర్స్ నుంచి మంచి టాక్ వస్తోంది. ముఖ్యంగా మహిళలు చూడాల్సిన చిత్రమిది’ అని అన్నాడు.

డైరెక్టర్  పళని మాట్లాడుతూ ‘బ్లాక్ మెయిలింగ్ వల్ల ఓ మహిళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది ఆలోచింపజేసేలా చూపించాం. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రానికి కూడా మంచి విజయం అందిస్తామని  ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు’ అని అన్నాడు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండటం వల్లే ఈ విజయం దక్కింది’ అని అన్నారు.