బంగ్లాదేశ్ లో అల్లర్లు: మీడియా ఆఫీసులను తగలబెట్టిన ఆందోళనకారులు

బంగ్లాదేశ్ లో అల్లర్లు: మీడియా ఆఫీసులను తగలబెట్టిన ఆందోళనకారులు

బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిపోతోంది.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. వందలాది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. మీడియా సంస్థలపై దాడులు చేశారు. వార్తాపత్రికల ఆఫీసులకు నిప్పంటించారు. భవనాల్లో మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న జర్నలిస్టులు హాహాకారాలు పెట్టారు. 

షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన నిరసనలలో కీరోల్ పోషించిన షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత అల్లర్లు రాజధాని ఢాకాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢాకాలోని ది డైలీ స్టార్, ప్రోథోమ్ అలో మీడియా సంస్థలపై దాడుల చేశారు నిరసనకారులు. మీడియా ఆఫీసులను తగలబెట్టారు. 

గురువారం అర్థరాత్రి హాది హత్య వార్త వ్యాపించగానే వందలాది మంది అతని మద్దతుదారులు హత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢాకా వీధుల్లో భారీ నిరసనలు తెలిపారు. ఢాకాలో మూడుచోట్లు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మీడియా సంస్థలు టార్గెట్ గా ఆందోళనకారులు దాడులు చేశారు. 

ది డైలీ స్టార్, ప్రోథోమ్ అలో వార్తాపత్రికల ఆఫీసుల్లో చొరబడిన  నిరసన కారులు విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత నిప్పటించారు. కింది అంతస్తుల్లో  నిప్పు పెట్టడంతో పై మంటలు, పొగ పై అంతస్తులకు వ్యాపించాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న జర్నిస్టులు  ఊపిరిపీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 

ది డైలీ స్టార్ రిపోర్టర్ జైమా ఇస్లాం..మండుతున్న భవనం లోపల చిక్కుకుపోయినప్పుడు తనకు ఎదురైన బాధను  వివరిస్తూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది.  నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. చాలా పొగ ఉంది. నేను లోపల ఉన్నాను. నువ్వు నన్ను చంపుతున్నావు అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో రాసింది.

ది డైలీ స్టార్ ఆఫీసులో చెలరేగిన మంటలు తెల్లవారుజామున శుక్రవారం తెల్లవారు జామున 1.40 గంటలకు అదుపులోకి వచ్చాయని అక్కడి అధికారులు తెలిపారు. ఘటన సమయంలో  27 మంది ఉద్యోగులు లోపలే ఉన్నారని తెలిపారు.మేము భవనం వెనుక భాగంలో దాక్కున్నాం.. ఆందోళనకారులు నినాదాలు చేయడం విన్నాం.. అని డైలీ స్టార్ రిపోర్టర్ అహ్మద్ దీప్టో రాశారు. 

అయితే ది డైలీ స్టార్, ప్రోథోమ్  వార్తాపత్రికలపై ఆందోళన కారులు ఎందుకు దాడి చేశారనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.. ఈ రెండు పత్రికలు కూడా తాత్కాలిక ప్రధాని  యూసఫ్ కు మద్దతునిచ్చే వార్తాపత్రికలే  అయినప్పటికీ ఆందోళనకారులు ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నగా మిగిలింది. 

మరోవైపు ఢాకాలో భారత డిప్యూటీ రాయబారి నివాసాన్ని కూడా ఆందోళన కారులు ముట్టడించారు. వందలాది మంది నిరసనకారులు భారత రాయబారి నివాసాన్ని చుట్టుముట్టడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారని స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి. 

నిరసనకారులు రాజధాని ఢాకా నుంచి బయటకు వెళ్లే కీలక రహదారిని కూడా దిగ్బంధించారు. చిట్టగాంగ్‌లోని మాజీ మంత్రి నివాసంపై దాడి చేశారు..ఢాకాలోని సాంస్కృతిక సంస్థ ఛాయానౌత్‌ను ధ్వంసం చేశారు.ఈ దాడుల్లో   జాతీయ ఛత్ర శక్తి, నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) వంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది.  

హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత హైకమిషన్ ను మూసివేసింది. హాదీ హంతలకు భారత్ అప్పగించే వరకు ఇది కొనసాగుతుంది.. అప్పుడు, ఇప్పుడు ..ఎప్పుడూ మేం యుద్దంలో ఉన్నామంటూ NCP లీడర్ సర్జిజ్ అల్మ్ చెప్పినట్లు అక్కడి మీడియా చెబుతోంది.