వనపర్తి, వెలుగు: సోనియా గాంధీ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సందర్భంగా గురువారం బీజేపీ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకున్నా గాంధీ కుటుంబాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, రాజీవ్‌గాంధీని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, ధనలక్ష్మి, రాజేంద్రప్రసాద్, శంకర్‌నాయక్, చంద్రమౌళి పాల్గొన్నారు.
