టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాంపియన్’. ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ 2 నిడివి 2 నిమిషాల 43 సెకన్లు ఉంది. ఈ ట్రైలర్తో దర్శకుడు కథేంటో దాదాపుగా చెప్పేశాడు. ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. హీరో కోసం కథ రాసుకున్నట్టుగా కాకుండా కథలో అంతర్లీనంగానే హీరో పాత్రను దర్శకుడు చూపించాడు.
చాంపియన్ ట్రైలర్ను చూస్తుంటే రోషన్ కెరీర్కు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుందని అనిపిస్తుంది. ఏదో ఒక రొటీన్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా ఒక బలమైన కథ, సంఘర్షణ ఈ సినిమాలో ఉన్నట్లు ట్రైలర్ను చూస్తే స్పష్టంగా అర్థమైంది. బైరాన్ పల్లిలో ఈ ‘చాంపియన్’ చేసిన పోరాటం ప్రేక్షకుల గుండెను తాకుతుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 25న సినిమాను చూడాల్సిందే.
బైరాన్‌పల్లి.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలంలో ఉన్న ఒక చారిత్రక గ్రామం. నిజాం కాలంలో రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి, 100 మందికి పైగా గ్రామస్థులు ప్రాణత్యాగం చేసిన వీరత్వానికి ఈ గ్రామం ప్రతీకగా నిలుస్తుంది. గ్రామంలోని బురుజు (కోట) వారి పోరాటానికి గుర్తుగా ఉంది.
ఇది జలియన్‌వాలా బాగ్ మారణహోమాన్ని తలపించే ఘటన. ఆగస్టు 27, 1948న రజాకార్లు గ్రామంపై దాడి చేసి, సుమారు 119 మంది గ్రామస్తులను చంపి, వారి శవాలను ఊరి మధ్యలో ఉన్న బురుజు చుట్టూ ఉంచి బతుకమ్మ ఆడించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం అయిన ఈ కథను ఆధారంగా చేసుకుని ‘చాంపియన్’ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు రాంచరణ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘చాంపియన్’ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి నిర్మించాయి.
