ఐపీఎల్​ టికెట్ల విక్రయంపై విచారణ జరపాలి

ఐపీఎల్​ టికెట్ల విక్రయంపై విచారణ జరపాలి

బషీర్ బాగ్, వెలుగు: ఐపీఎల్ టికెట్ల విక్రయంలో అవినీతి జరుగుతోందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఉన్నత స్థాయి కమిటీని నియమించి విచారణ జరిపించాలని కోరారు. గురువారం హిమాయత్​నగర్ లోని సత్యనారాయణరెడ్డి భవన్ లో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సీజన్​లో ఇప్పటివరకు ఉప్పల్​స్టేడియంలో జరిగిన రెండు మ్యాచులకు టికెట్లు దొరకక ఫ్యాన్స్​నిరాశకు గురయ్యారన్నారు. టికెట్ల విక్రయంలో పారదర్శకత లేదని ఆరోపించారు. 

ఈ నెల 25న జరగాల్సిన హైదరాబాద్​వర్సెస్​బెంగళూరు మ్యాచ్​టికెట్లను ఆన్​లైన్​లో పెట్టిన అరగంటలో అమ్ముడుపోయినట్లు చెబుతున్నారని, అరగంటలో 36 వేలకు పైగా టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు. హెచ్ సీఏ, సన్ రైజర్స్ హైదరాబాద్​టీమ్​యాజమాన్యాలు బ్లాక్ మార్కెట్ ద్వారా టికెట్లను విక్రయించారని ఆరోపించారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యప్రసాద్, శ్రీమాన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్.బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, మజీద్, కళ్యాణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్​లో అమ్ముకుంటున్నరు

ముషీరాబాద్: హెచ్​సీఏ, ఎస్ఆర్ హెచ్​యాజమాన్యాలు ఐపీఎల్ టికెట్లను బ్లాక్​లో అమ్ముకుంటున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీవైఎల్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఐపీఎల్​టికెట్ల విక్రయంలో అవినీతి జరిగిందని, ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలని కోరింది. 
గురువారం విద్యానగర్ మార్క్స్ భవన్, పి.వై.ఎల్ ఆఫీసులో యువజన సంఘాల సమావేశం జరిగింది. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్ ప్రదీప్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రి, ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, డి.వై.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ పాల్గొని మాట్లాడారు.