SRH vs RR: రాజస్థాన్‌తో కీలక మ్యాచ్.. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్

SRH vs RR: రాజస్థాన్‌తో కీలక మ్యాచ్.. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్

ఐపీఎల్ లో రెండు అగ్ర శ్రేణి జట్ల మధ్య పోరు జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. ఉప్పల్ ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  

సన్ రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. మరో మూడు మ్యాచ్ ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్తుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 9 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.        

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్