
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది.
గతేడాది క్రిస్మస్ కానుకగా జనవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు థియేటర్స్ ఊగిపోయాయి. దాంతో రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ.
అయితే ప్రభాస్ కి మన ఇండియాలో మాత్రమే కాకుండా జపాన్ దేశంలో కూడా అభిమాన బలం భారీ స్థాయిలో ఉంది.ఇక ప్రభాస్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా జపాన్ లో సలార్ రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ మేరకు జూలై 5న జపాన్ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్దమయింది చిత్ర బృందం.
దీంతో ప్రభాస్ తాకిడికి..అక్కడి ఫ్యాన్స్ లో వేడి సెగలు రేగడం మాత్రం కన్ఫమ్.వాస్తవానికి జపాన్ లో ప్రభాస్ సినిమాలకి సూపర్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి జపాన్ ని తాను టేకోవర్ చేయడం కన్ఫర్మ్ అని ముందే డిసైడ్ అవ్వొచ్చు.
ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా సలార్ శౌర్యాంగపర్వం వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈఏడాది చివర్లో థియేటర్స్ లోకి రానుంది. ఈ నెలాఖరులో (మే) రామోజీ ఫిలిం సిటీలో పది రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్ తో షూటింగ్ షురూ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గత మూడు నెలల నుంచి డైరెక్టర్ ప్రశాంత్, అతని టీం అంతా కలిసి కలిసి సలార్ 2 స్క్రిప్ట్ పనిలో నిమగ్నం అయ్యారని..ఇక అతి త్వరలో స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి,మారుతీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.ఇక ఏ మాత్రం ఖాళీ టైం దొరికిన సలార్ 2 సెట్లో పాల్గొనే ఛాన్స్ ఉంది.
特報 Vol.1️⃣
— 【公式】映画『サラール』 (@salaar_jp) May 2, 2024
 ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄
映画『サラール』7.5(Fri) 公開決定?
ポスタービジュアル解禁?
/
俺の名を呼べば、お前のために、俺は戦う。
\
『#バーフバリ』の #プラバース と
『#KGF』シリーズの監督
プラシャーント・ニールの最強タッグ!#サラール?#Salaar? pic.twitter.com/XNNw1ZJOu3