రుణమాఫీని మోదీ ఆపాడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రుణమాఫీని మోదీ ఆపాడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 

  •  వంశీని  గెలిపిస్తే పనులు చేసుకోవచ్చు
     

కోల్​బెల్ట్​:  ప్రజల సొమ్ము దోచుకున్న కేసీఆర్ ను జైలుకు  పంపుతామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి  గడ్డం వంశీకృష్ణ తరపున మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని  నెన్నెల మండల కేంద్రం,.మైలారం, ఘనపూర్  గ్రామాల్లో ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడారు. అనంతరం కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్  అధికారంలోకి వస్తే ఈజీఎస్ కూలీలకు 400 వేతనం ఇస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

 ఎన్నికల కోడ్ తర్వాత అర్హులైన పేదలకు ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. రైతులకు సీఎం 2 లక్షల రుణ మాఫీ  కోసం బ్యాంకర్లతో చర్చించాడని, కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు లబ్ధి జరుగుతుందని భావించి రుణమాఫీని మోడీ  ఆపాడని ఆరోపించారు. ఎంపీగా  వంశీకృష్ణను  గెలిపిస్తే  కాకా స్ఫూర్తిగా ప్రజాసేవ చేస్తాడన్నారు. పరిశ్రమ లు తీసుక వచ్చి యువత కు ఉద్యోగాలు కల్పిస్తాడన్నారు.

  కోడ్ తర్వాత బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సహకారంతో సమస్యల పరిష్కరిస్తామన్నారు. కేసీఆర్​ మూడు లక్షల కోట్ల అప్పు తీసుకుని  ఖజానా ఖాళీ చేసిండని ఆరోపించారు. నెలకు రూ. 8500 మహిళల అకౌంట్ లో జమ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారన్నారు.  ఈ సందర్భంగా పలువురు బీఅర్ఎస్​ లీడర్లు, బీజేపీ సోషల్ మీడియా ఇంచార్జి సునకర్ రాంబాబు కాంగ్రెస్ లో చేరారు. నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేశారన్నారు.