ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న భారీ యాక్షన్-స్పై థ్రిల్లర్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar). డిసెంబర్ 5న రిలీజైన మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లతో ప్రకంపనలు సృష్టిస్తోంది. 24 రోజుల్లో, డిసెంబర్ 28న ఆదివారంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1050 కోట్ల మార్కును దాటింది. ఈ భారీ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో ‘ధురంధర్’ 7వ స్థానానికి చేరుకుంది.
చేరుకోవడమే కాకుండా, రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ రికార్డులను సైతం తుడిచిపెట్టేసింది. ఈ వారం క్రిస్మస్ సెలవులు కూడా కావడంతో అంతర్జాతీయంగా ఈ సినిమా కలెక్షన్లు భారీగా పెరిగాయి. దీని వల్ల ఈ సినిమా గడిచిన రెండు రోజుల్లోఓవర్సీస్‌లో $26 మిలియన్ల గ్రాస్ కలెక్షన్లను అధిగమించగలిగింది. దీనితో, ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా మరిన్ని రోజులు సత్తా చాటడానికి మార్గం తేలికైంది.
‘ధురంధర్’ ఓటీటీ:
ధురంధర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో ధురంధర్ ఓటీటీ హక్కులు ఇండియన్ సినీ హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డు రేట్ దక్కించుకుందని టాక్. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.285 కోట్లు ఖర్చు పెట్టిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇది గతంలో పుష్ప 2 మూవీ డిజిటల్ హక్కులు రూ.275 కోట్లను అధిగమించి అమ్ముడవడం విశేషం.
అయితే, బాలీవుడ్ నివేదికల ప్రకారం, ధురంధర్ సినిమా థియేటర్ రన్ పూర్తయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. జనవరి 30, 2026న స్ట్రీమింగ్ అవ్వనుందని సమాచారం. ఇకపోతే, స్ట్రీమింగ్ డేట్పై చిత్ర నిర్మాతలు లేదా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ALSO READ : కుమ్రంబీమ్ జిల్లాలో సినీనటి కొణిదెల నిహారిక సందడి ..
దాదాపు ఏడాది విరామం తర్వాత వెండితెరపైకి వచ్చిన రణ్‌వీర్, ఇందులో మునుపెన్నడూ చూడని క్రూరమైన, తీవ్రమైన అవతార్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రణ్‌వీర్‌ను గుర్తుపట్టలేనంతటి భయంకరమైన లుక్‌తో ఆకట్టుకున్నారు. ఆయనలోని అపారమైన శక్తి, తీవ్రత క్షణాల్లోనే ఈ గ్రిట్టీ యాక్షన్ డ్రామాకు టోన్ సెట్ చేశాయి. రణ్‌వీర్ సింగ్ మేకోవర్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నటులలో ఒకరిగా అతని స్థానాన్ని ఈ మూవీ మరోసారి నిరూపించిందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
