గండిపేట, వెలుగు: కిస్మత్పూర్ డివిజన్ పరిధిలోని లంబాడీ తండాలో సేవాలాల్ మందిర నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు కిస్మత్పూర్ మాజీ ఉపసర్పంచ్, బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు నీరుడు శేఖర్ ముదిరాజ్ ముందుకొచ్చారు.
సేవాలాల్ మందిర కమిటీ సభ్యులు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి నిర్మాణానికి సహాయం చేయాలని కోరగా.. ఎస్.ఎస్.ఫౌండేషన్ తరఫున స్లాబ్ కు కావాల్సిన స్టీల్ తోపాటు మందిరం లోపల గ్రానైట్ వేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు శేఖర్ముదిరాజ్ను సన్మానించారు.
