రాత్రి వేళల్లో అనవసరంగా తిరిగితే చర్యలు : డీఎస్పీ జీవన్ రెడ్డి

రాత్రి వేళల్లో అనవసరంగా తిరిగితే చర్యలు : డీఎస్పీ జీవన్ రెడ్డి
  •     డీఎస్పీ జీవన్ రెడ్డి 
  •     ఆపరేషన్ ఛబుత్రలో 150 మందికి కౌన్సెలింగ్

ఆదిలాబాద్, వెలుగు: అర్ధరాత్రి పట్టణాల్లో అనవసరంగా, అకారణంగా తిరిగే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ​డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో శనివారం అర్ధరాత్రి పట్టణంలో ఆపరేషన్ ఛబుత్ర నిర్వహించారు. అకారణంగా తిరుగుతున్న 150 మంది యువకులను వన్​టౌన్ పోలీస్ స్టేషన్​కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.పట్టణంలోని వ్యాపార సమూహాలు రాత్రి 10.30 గంటలకు మూసి వేయాలని, 11 గంటల వరకు ఇండ్లకు చేరుకోవాలన్నారు. 

అలా కాకుండా అనవసరంగా తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో ఆసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆపరేషణ్ ఛబుత్రా నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ సీఐలు సునీల్ కుమార్, కె.నాగరాజు, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, మావల ఎస్సై రాజకుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, బి.శ్రీపాల్, ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు.