విజయ్ ఇంటికెళ్లి.. విరోష్ జంటను ఆశీర్వదించిన సీఎం రేవంత్

విజయ్ ఇంటికెళ్లి.. విరోష్  జంటను ఆశీర్వదించిన సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి  నూతన దంపతులు విజయ్ దేవర కొండ రష్మికను ఆశీర్వదించారు.  విరోష్  జోడి పెళ్లి ఫిబ్రవరి 26న  ఉదయ్ పూర్ లో జరగగా..రిసెప్షన్ హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో మార్చి 4న జరిగిన సంగతి తెలిసిందే.. ఆరోజు రిసెప్షన్ కు కేవలం సీఎం సతీమణి గీతారెడ్డి వెళ్లారు. రేవంత్ రెడ్డి ఆరోజు ఢిల్లీ పర్యటనలో ఉండటంతో రిసెప్షన్ కు వెళ్లలేకపోయారు. దీంతో మార్చి 5న విజయ్ దేవర కొండ ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ దంపతులకు పూల బొకే ఇచ్చి  విషెష్ చెప్పారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి కుటుంబ సభ్యులు,బంధువుల సమక్షంలో ఉదయ్ పూర్ లో  జరిగింది.   రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్ లో  ఘనంగా జరిగింది. రిసెప్షన్ కు  విజయ్ దేవర కొండ వైట్ పంచె,భుజంపై కండువతో .. రష్మిక రెడ్ శారీలో అదిరిపోయే లుక్ లో కనిపించారు.   ఫస్ట్ ఇరు ఫ్యామిలీలతో కలిసి నూతన దంపతులు ఫోటోలు దిగారు. ఈ   రిసెప్షన్ కి సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

►ALSO READ | OTT Series: ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్ ట్రెండింగ్‌.. వారంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్

తెలంగాణ గవర్ణర్ జిష్ణు దేవ్ వర్మ,  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,  మంత్రి జూపల్లి కృష్ణారావు, కేటీఆర్ దంపతులు, హైదరాబాద్ సీపీ సజ్జనార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లారాజేశ్వర్ రెడ్డి, కేవీపీ రామచందర్ రావు,   డైరెక్టర్ సుకుమార్, బుచ్చిబాబు, బాబి, నాగార్జున, నాగచైతన్య, వెంకటేశ్,రవితేజ,శ్రీకాంత్ దంపతులు,  నిర్మాత దిల్ రాజు దంపతులు,మహేశ్ బాబు సతీమణి నమ్రతా, హీరో కార్తీ,  నవీన్ పొలిశెట్టి, నిర్మాత నవీన్ ఎర్నేణి, నటి కృతిశెట్టి, సింగర్ చిన్మయి, నాగవంశీ, సందీప్ కిషన్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు.