Janhvi Kapoor: జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్

Janhvi Kapoor: జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్

బాలీవుడ్ బ్యూటీ, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇవాళ శుక్రవారం (మార్చి 6, 2026) జాన్వీ కపూర్ తన 29వ పుట్టినరోజును జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా పెద్ది మేకర్స్ జాన్వీకి విషెష్ చెబుతూ క్రేజీ పోస్టర్తో పాటుగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ‘మాటలకు అతీతమైన చక్కదనం, కళ్ళతో చెప్పగలిగే నటన.. పుట్టినరోజు శుభాకాంక్షలు జాన్వీకపూర్’ అని విషెస్ తెలియజేశారు. 

పెద్ది మూవీలో జాన్వీ రోల్ని అచ్చియమ్మ అంటూ పక్కా ఉత్తరాంధ్ర పాత్రని పరిచయం చేశారు. చికిరి సాంగ్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మెగా ఫ్యాన్స్లో జాన్వీ అలజడి సృష్టించింది. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ రావడంతో మరింత క్యూరియాసిటీ పెంచేసింది.

జాన్వీ కపూర్ నటిస్తోన్న పెద్ది మూవీ, రురల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ కథలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమ్మన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతోంది. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!