99 డేస్ యాక్షన్ ప్లాన్..మెదక్ లో కలెక్టర్లతో మంత్రి వివేక్ మీటింగ్

99 డేస్ యాక్షన్ ప్లాన్..మెదక్ లో కలెక్టర్లతో మంత్రి వివేక్ మీటింగ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యింది. తొలి  ఉమ్మడి మెదక్ జిల్లా   ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో  భాగంగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో  జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశం నిర్వహించారు.  ఎంపీ రఘనందనరావ్, ఏమ్మెల్యే మైనం పల్లి రోహిత్. ఎమ్మెల్యేసంజీవ్ రెడ్డి. ఎంపీసురేష్ శెట్కార్.ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి రెడ్డి, మెదక్ , సంగారెడ్డి  ,సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ఉమ్మడి జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

షెడ్యూల్ లో భాగంగా తొలిరోజు  అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి.  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని ముందస్తు పండుగలా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. ఇయ్యాల్టీ నుంచి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్లను అధికారులు క్లియర్ చేయనున్నారు.  గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవలు, ప్రజల అవసరాలు తీర్చేలా ఐదు దశల్లో ఈ ప్రణాళికను అమలు చేయనున్నారు. 

►ALSO READ | ఆమనగల్లు 7వ వార్డులో బోగస్ ఓట్ల కలకలం

ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరినీ ఇందులో భాగస్వాములను చేశారు. గ్రామ, వార్డు సభల్లో స్కీములవారీగా ఎంపికైన లబ్ధిదారుల లిస్టులను బహిరంగంగా డిస్​ప్లే చేయనున్నారు. లిస్టులను క్షేత్రస్థాయిలో విచారించి అవసరమైతే వెంటనే అప్​డేట్ చేయాలి. గతంలో తీసుకున్న పాత దరఖాస్తులు ఏవైనా పెండింగ్ లో ఉంటే.. అవి ఎందుకు ఆగాయో దానికి గల కారణాలు అధికారులే ప్రజలకు కచ్చితంగా చెప్పాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.