ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

పద్మారావునగర్, వెలుగు: సనత్​నగర్​నియోజకవర్గంలో పీసీసీ వైస్​ప్రెసిడెంట్​డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో కాంగ్రెస్​141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సనత్​నగర్, బీకే గూడ, అమీర్​పేట్, ఎస్సార్​నగర్, బేగంపేట్, బన్సీలాల్​పేట్, పద్మారావునగర్, రాంగోపాల్​పేట్ డివిజన్లలో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..1885లో స్థాపించిన కాంగ్రెస్​పార్టీ దేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించి, అనంతరం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. 

విద్యుదీకరణ, ఐఐటీలు, ఎయిమ్స్, బ్యాంకుల జాతీయీకరణ, ఉపాధిహామీ, ఆర్టీఐ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్​మెంట్​వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్​పాలనలోనే అమలయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కూడా పార్టీదేనన్నారు. ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.